PC: X
పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ నేషనల్ ఛాంపియన్స్ కప్-2026 రసవత్తరంగా సాగుతోంది. వన్డే ప్రపంచకప్-2027 పటిష్టమైన జట్టును తాయారు చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని తొలిసారి నిర్వహిస్తోంది. షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, ఖుష్‌దిల్ షా వంటి జాతీయ జట్టు ఆటగాళ్లు ఈ నేషనల్ ఛాంపియన్స్ కప్‌లో ఆడుతున్నారు.
అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ వైట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖుష్‌దిల్.. ఆదివారం పాకిస్తాన్ గోల్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. చిన్న తప్పిదం వల్ల తన వికెట్‌ను ప్రత్యర్ధి జట్టుక సమర్పించుకున్నాడు.
ఏమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వైట్స్ 22 ఓవర్‌లలో కేవలం 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయం క్రీజులో వచ్చిన ఖుష్‌దిల్ షా.. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సినపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించి తన వికెట్‌ను కోల్పోయాడు.
పాకిస్తాన్ గోల్డ్ స్పిన్నర్ ఫైసల్ అక్రమ్ ఓ వేసిన ఓ బంతిని ఖుష్‌దిల్ ఆఫ్ సైడ్ దిశగా కట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ కింద భాగంలో తగిలి, వికెట్ల పక్కగా వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి ఎటు వెళ్లిందో గమనించని ఖుష్‌దిల్.. సింగిల్ కోసం క్రీజ్‌ను వదిలి కాస్త ముందుకే వచ్చాడు.
కానీ బంతి మాత్రం కీపర్ పక్కన ఉంది. ఖుష్‌దిల్ క్రీజును వదిలి బయటకు వెళ్లడం గమనించిన వికెట్ కీపర్ వెంటనే స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఊహించని విధంగా అతడు రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో.. కాస్త వెనక ముందు చూసుకోవాలి కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.


