పాక్‌లో భారత దౌత్యవేత్తలు అదృశ్యం

Two Indian officials working with Indian High Commission in Islamabad ( - Sakshi

ఇస్లామాబాద్‌ : దాయాది దేశం పాకిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు అదృశ్యమయ్యారు. ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రెండు గంటలుగా కనిపించడంలేదు. స్థానిక అధికారులు పాక్‌ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి కోసం సిబ్బంది గాలిస్తున్నప్పటికీ ఆచూకీ ఇంకా లభ్యంకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇద్దరు దౌత్యవేత్తల మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం ఆరా తీసింది. అక్కడి అధికారులను సంప్రదించి వివరాలను సేకరిస్తోంది. కాగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. (పాకిస్తాన్‌ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top