పేస్‌ పునరాగమనం!

Leander Paes Makes Himself Available For Davis Cup Tie Against Pakistan - Sakshi

పాక్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటన

న్యూఢిల్లీ: భద్రతా కారణాలదృష్ట్యా పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడేందుకు పలువురు భారత టెన్నిస్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు విముఖత చూపిన నేపథ్యంలో... వెటరన్‌ స్టార్, 46 ఏళ్ల లియాండర్‌ పేస్‌ ముందుకొచ్చాడు. డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1లో భాగంగా నవంబర్‌ 29, 30వ తేదీల్లో ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ కోసం తాను అందుబాటులో ఉంటానని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) వర్గాలకు తెలిపాడు.

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) కోరిక మేరకు... ఈ పోటీలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత ఆటగాళ్లకు వీసాలు జారీ చేసేందుకు అవసరమైన పత్రాలను పాకిస్తాన్‌ అధికారులకు పంపించామని ఏఐటీఏ జనరల్‌ సెక్రటరీ హిరణ్మయ్‌ చటర్జీ తెలిపారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ మైనేనితోపాటు అర్జున్‌ ఖడే, విజయ్‌ సుందర్‌ ప్రశాంత్, శ్రీరామ్‌ బాలాజీ, సిద్ధార్థ్‌ రావత్, మనీశ్‌ సురేశ్‌ కుమార్, శశికుమార్‌ ముకుంద్‌ ఉన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top