Imran Khan Custody: కస్టడీకి ఇమ్రాన్‌ ఖాన్‌.. గుండెపోటు ఇంజెక్షన్‌ ఇచ్చారంటూ ఆరోపణలు

Custody For Pakistan Ex PM Imran Khan - Sakshi

ఇస్లామాబాద్‌: అవినీతి సంబంధిత కేసుల్లో పీటీఐ అధినేత, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కస్టడీ విధించింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే దర్యాప్తు సంస్థ ది నేషనల్‌ అకౌంటబిలిటీ(NAB) పదిరోజుల కస్టడీకి కోరగా.. కోర్టు మాత్రం ఎనిమిది రోజులకు మాత్రమే అనుమతించింది. 

ఓ (Al-Qadir Trust Case) కేసులో విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన్ని .. సైన్యం సాయంతో దర్యాప్తు సంస్థ మంగళవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన్ని రాత్రికి రాత్రి అజ్ఞాతంలోకి తరలించారు.  అయితే  ఇవాళ  కోర్టు(National Accountability Bureau Court)లో ఆయన్ని హాజరు పర్చగా.. అవినీతి సంబంధిత కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు ప్రశ్నించేందుకు కస్టడీ కోరింది ఎన్‌ఏబీ. కానీ, కోర్టు మాత్రం 8 రోజులకు అనుమతి ఇచ్చింది.    

అయితే రాత్రికి రాత్రే తనకు నరకం చూపించారంటూ ఆరోపణలకు దిగారు ఇమ్రాన్‌ ఖాన్‌. కనీసం వాష్‌రూం కూడా వినియోగించుకోనివ్వకుండా తనను టార్చర్‌ చేశారంటూ కోర్టులో బోరుమన్నాడు ఇమ్రాన్‌ ఖాన్‌. అంతేకాదు.. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించడానికి తనకు ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారాయన.మే 17వ తేదీన ఈ కేసులో తదుపరి వాదనలు విననుంది కోర్టు.   

మరోవైపు పీటీఐ కార్యకర్తలు పాక్‌ను అగ్గిగుండంగా మార్చేశారు. ఒకవైపు ఇస్లామాబాద్‌లో గుమిగూడాలని పిలుపు ఇస్తూనే.. మరోవైపు ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పీటీఐ ముఖ్యనేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇక  పెషావర్‌ ఆందోళనల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంద్‌కు పిలుపు ఇచ్చింది పీటీఐ.

ఇదీ చదవండి: ఖాన్‌ అరెస్ట్‌పై ఆందోళన

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top