పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన శ్రీలంక | Sri Lanka pulls out of 19th SAARC summit in Islamabad | Sakshi
Sakshi News home page

Sep 30 2016 7:34 PM | Updated on Mar 20 2024 3:54 PM

టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌కు తాజాగా శ్రీలంక కూడా షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ సమావేశాలకు వెళ్లకూడదని శ్రీలంక నిర్ణయించింది. ఈ మేరకు లంక విదేశాంగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకూ సార్క్ సదస్సుకు గైర్హాజరు అవుతున్న దేశాల సంఖ్య అయిదుకు చేరింది. తీవ్రవాదంపై పోరులో భారత్‌కు బాసటగా నిలిచిన బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలు సార్క్ సమ్మిట్కు హాజరయ్యేది లేదని స్పష్టం చేశాయి. నవంబర్ 9, 10 తేదీలలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా సార్క్ సమ్మిట్ జరుగనున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement