ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్ ఏజెంట్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయనే భారత్‌కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్.. గురువారం కూడా స్టేషన్‌కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్‌మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్‌మెన్ వెంటనే తేరుకుని.. అదీల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్‌లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
SP City of Islamabad Police Adeel Akbar was an agent of India
He shot himself today .
His inputs were very helpful during Op Sindoor.
Thank you Adeel bhai , you have been a great help. pic.twitter.com/XZhcZTKZmn— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) October 23, 2025
ఇక, అదీల్ అక్బర్ సియాల్‌కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్‌లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్ అక్బర్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అదీల్ అక్బర్.. మన సైన్యానికి ఇన్‌పుట్స్ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.


