భారత్‌ ఇఫ్తార్‌ విందులో పాక్‌ ఓవరాక్షన్‌

Pakistani Officials Harass Guests Invited At Iftar Party - Sakshi

అతిథులను వేధించిన సెక్యూరిటీ సిబ్బంది

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ దేశ భద్రతా సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తించారు. ఇప్తార్ విందుకు హాజరైన అతిథులతో అత్యంత అమర్యాదగా వ్యవహరించారు. రంజాన్‌ సందర్భంగా ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్లో భారత హైకమిషన్ అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా, దానికి పలువురు అతిథులు వచ్చారు. అయితే, భద్రతా కారణాల పేరుతో పాక్ సెక్యూరిటీ.. గెస్ట్‌లను వేధింపులకు గురిచేశారు. భద్రత పేరుతో అతిథులకు తీవ్ర అసహం కలిగించారు. ఓ అతిథి మీద చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. మరికొందరు గెస్ట్‌ల కార్లను పార్కింగ్‌ స్థలం నుంచి తొలగించగా.. మరికొందరి వాహనాలను హోటల్‌లోకి అనుమతించలేదు.

దీంతో కొందరు ముఖ్యలు కార్యక్రమానికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ పదే పదే భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు ఈ తరహాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఇతర దేశస్తులు ఎవరైనా పాకిస్తాన్‌లో అడుగుపెట్టినా.. వారినికూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రంజాన​ మాసం కావడంతో.. అనువనవూ గాలింపు చేపడుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top