Viral Video: Son Welcomes His Mother With Flowers, Gets Chappal Ki Pitai - Sakshi
Sakshi News home page

Viral Video: ఎయిర్‌పోర్టులో కొడుకును చెప్పుతో కొట్టిన తల్లి..

Dec 3 2021 8:51 PM | Updated on Dec 4 2021 1:46 PM

Mother Thanks Son With Chappal Ki Pitai : Viral Video - Sakshi

ఇస్లామాబాద్‌: సాధారణంగా ఎవరైన మనవారు విదేశాల నుంచి వస్తే.. ఎయిర్‌పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. కొందరు పూల బోకేలు ఇచ్చి స్వాగతం పలికితే.. మరికొందరు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు, ఫ్లెక్సీలు, బ్యాండ్‌లను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. కొందరైతే తమ వారిని చూడగానే.. ఎమోషనల్‌గా ఫీలై వారిని ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన..  ఒక తల్లి ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన  కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ ఘటన పాక్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. కాగా, అన్వర్‌ జలాని అనే వ్యక్తి ఎయిర్‌ పోర్టులో తన తల్లికోసం​ బోకే పట్లుకోని, మిస్‌యూ అమ్మ.. అంటూ ఫ్లకార్డు పట్టుకోని మరీ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతని తల్లి బయటకు వచ్చింది. అ‍ప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.

స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆ తర్వాత.. ఎమోషనల్‌తో అతడిని హత్తుకుంది. దీన్ని అన్వర్‌ జిలానీ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘ వావ్‌.. ఎంతలా మిస్‌ అయ్యిందో..’,‘ భలే.. కొట్టింది.. ఆ తల్లి..’, ‘నవ్వు ఆపుకోలేక పోతున్నాం..’, ‘నిన్ను ఇలా ఆశీర్వదించింది..’, ‘నీకు వెరైటీగా థైంక్స్‌ చెప్పిందంటూ..’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement