
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్‌లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్‌లో ఇద్దరు పాక్ పైలట్‌లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.
S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది.
ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
రంగంలోకి భారత నౌకాధళం
రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.
దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేత
తాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు.
ఢిల్లీలో హై అలర్ట్
తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.
మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడి
ఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.
పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేత
పాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.
15 భారత సైనిక స్థావరాలపై గురి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్‌లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది.
గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది.
గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్‌పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది.
యుద్ధ వాతావరణం
భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్‌కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది.
పీఎంఓ భేటీ జరుగుతుండగానే!
ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్‌లోకి తరలించినట్టు చెబుతున్నారు.
పలుచోట్ల బ్లాకౌట్
పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్‌సర్, హోషియార్‌పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.