ఇదీ ఏఐ ప'వార్‌'! | Artificial Intelligence Enters the Battlefield | Sakshi
Sakshi News home page

ఇదీ ఏఐ ప'వార్‌'!

Mar 20 2026 1:35 AM | Updated on Mar 20 2026 1:35 AM

Artificial Intelligence Enters the Battlefield

యుద్ధ రంగంలోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత 

ఏఐ ఆధారిత ఆయుధాలకు బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యయం

సాక్షి, స్పెషల్‌ డెస్క్:  ఉక్రెయిన్‌ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్‌ ప్లానింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. 

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్‌ వార్‌ఫేర్‌ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్‌ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం.  

దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..
1. అమెరికా:   మొత్తం బడ్జెట్‌ 997 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్‌లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్‌ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్‌ డాలర్లు కేటాయించారు.

2. చైనా:  మొత్తం బడ్జెట్‌ 314 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్‌ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్‌ క్లస్టర్ల కోసం 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.

3. రష్యా:   మొత్తం బడ్జెట్‌: 149 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.

4. భారత్‌:   మొత్తం బడ్జెట్‌: 93.5 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్‌డీఓ, ఇండియన్‌ నేవీ కలిసి ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.

యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..
1. ఇజ్రాయెల్‌–గాజా సంఘర్షణ:  
ది గోస్పెల్‌ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్‌ టార్గెట్‌ సిస్టమ్‌. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. 
లావెండర్‌: సోషల్‌ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. 
వేర్‌ ఈజ్‌ డాడీ?: లావెండర్‌ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్‌ సాధనం. 
స్మార్ట్‌ షూటర్స్‌: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్‌–సైట్స్‌. 

2. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం: 
అటానమస్‌ డ్రోన్లు: రష్యన్‌ జీపీఎస్‌ జామింగ్‌ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. 
మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. 
డెల్టా సిస్టమ్‌: ఇది ఉక్రెయిన్‌ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్‌ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్‌ టైమ్‌ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 

3. వెనిజులా
నికోలస్‌ మదురోను పట్టుకోవడానికి కారకాస్‌లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్‌ క్లౌడ్‌ ఏఐని (పలాంటిర్‌ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్‌ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 

4. ఇరాన్‌ (ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ): 
కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్‌ మావెన్, క్లౌడ్‌ ఏఐని ఉపయోగించారు.   

Advertisement
 
Advertisement
Advertisement