war zone
-
పాకిస్తాన్ 30 విమానాలకు తప్పిన ప్రమాదం..
లాహోర్: పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్‌జోన్‌లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్‌జోన్‌లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్‌కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్‌తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్‌ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్‌లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్ ఫార్స్’పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్‌పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌లో రైల్వే స్టేషన్‌పై దాడి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో రైల్వే స్టేషన్‌పై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్‌లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో స్వీడన్ పౌరుడికి ఉరి ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లోని లారెస్తాన్ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్‌లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్‌కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. అతడు స్వీడన్ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్‌లో హెజ్»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్‌లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ కార్యకలాపాల కోసం హెజ్»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ యాంటీ–షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది. ఇరాన్ మంత్రి ఖతీబ్ మృతి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానల్ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్‌పై బహుళ వార్హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్) అసీమ్ ఆర్.మహాజన్ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్మొహమ్మెద్ బిన్ జయేద్ అల్ నహ్యాల్లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్‌కు రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ గుండా భారత్‌కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్‌లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ప్‌లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు. -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే
దుబాయ్: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం తెల్సిందే. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.ఈయూ సైనికులూ ఉగ్రవాదులేనిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్ విభాగం బలగాలను యూరోపియన్ యూనియన్(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయితే, యూరప్‌లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్ మహ్మద్ బఘెర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆది, సోమవారాల్లో లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్ గల్ఫ్‌లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. -
మళ్లీ.. దక్షిణాదికి వెళ్లిపోండి!
గాజా సిటీ: గాజా నగరాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ఆర్మీ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నగరాన్ని యుద్ధ జోన్‌గాను, అందులోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగాను ప్రకటించింది. రెడ్ జోన్లలోని వారంతా ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. దక్షిణాదిన ఉన్న మువాసికి వెళ్లాలని, అక్కడ ఏర్పాటు చేసిన హ్యుమానిటేరియన్ ఏరియాలో తలదాచుకోవాలని ఆర్మీ ప్రతినిధి అవిచె ఆండ్రీ ఎక్స్‌లో కోరారు. హమాస్‌కు గట్టి పట్టున్న యుద్ధ క్షేత్రంగా మారినందున వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. నిర్దేశించిన మార్గంలో వెళితే ఎలాంటి తనిఖీలు ఉండవని చెప్పారు. హ్యుమానిటేరియన్ జోన్లో ఫీల్డ్ ఆస్పత్రులు, వాటర్ పైప్లైన్లు, ఆహారం, టెంట్లు ఉంటాయన్నారు. ఆర్మీ రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కనీసం 10 లక్షల మంది ఉంటున్నారు. వీరందరినీ ఖాళీ చేయించడం వల్ల మానవీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతుందని సహాయక సంస్థలు అంటున్నాయి. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న పోరు కారణంగా పాలస్తీనియన్లు పదేపదే ఉన్న చోటును వదిలి వేరే చోటును ఆశ్రయించాల్సి వచ్చింది. సరైన ఆహారం సైతం లభించని స్థితిలో బలహీనంగా, ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. ‘వాళ్లు మాకు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి మేం ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? గాయపడిన వాళ్లు, జబ్బున పడిన వాళ్లు, ముసలి వాళ్లు ఉంటే వాళ్లని ఎక్కడికని తీసుకెళ్లాలి?’అని గాజా సిటీకి చెందిన ఉమ్ హైతమ్ ప్రశ్నించారు. తాజాగా, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించిన హ్యుమానిటేరియన్ జోన్ విషయంలో తమతో సంప్రదించలేదని ఐరాస ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రతినిధి ఒల్గా చెరెవ్కో అన్నారు. గతంలో మువాసి సహా పలు ప్రాంతాలను మానవతా జోన్లుగా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఆర్మీ వాటిపై దాడులకు దిగిందని గాజా ఆరోగ్య విభాగం అంటోంది. ఇలా ఉండగా, శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ నగరంలోని మరో రెండు బహుళ అంతస్తుల భవనాలకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 12 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే ఒక భవనాన్ని కూలి్చనట్లు మంత్రి ప్రకటించారు. ఆకాశ హర్మ్యాలను హమాస్ నిఘాకు వాడుకుంటోందన్నది ఆర్మీ ఆరోపణ. కాగా, హమాస్ తమ చెరలో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీల వీడియోలను తాజాగా విడుదల చేసింది. వీరిద్దరిని గై గిల్బోవా–దలాల్, అలొన్ ఒహెల్గా గుర్తించారు. వేలాదిగా ఆర్మీ సిబ్బందితో గాజాపై నియంత్రణకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలతో మిగతా బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారి కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. యుద్ధాన్ని ముగించి, బందీలను సురక్షితంగా విడిపించాలని వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ను కలిశారు. -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? సెక్యూరిటీ విధానమేమిటి?
ఇజ్రాయెల్‌కు, ఉగ్ర సంస్థ హమాస్‌కు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు 3500 మందికి పైగా జనం మరణించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సందర్శించారు. ఒకపక్క క్షిపణుల వర్షం కురుస్తున్నా... జోబైడెన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఎలా? ఆయన భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సురక్షితంగా టెల్ అవీవ్ ఎలా చేరుకున్నారు? యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య గత ఏడాది యుద్ధం మొదలైన తరువాత కూడా ఆయన ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకుని, రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా జో బైడెన్.. ఇజ్రాయెల్‌లోని వార్ జోన్‌ను సందర్శించారు. ఆ దేశ అధినేత బెంజమిన్ నెతన్యాహు స్వయంగా బైడెన్‌కు స్వాగతం పలికారు. అయితే ఒకపక్క క్షిపణులు ప్రమాదకరంగా ఎగురుతున్న తరుణంలోనే జో బైడెన్ వార్‌జోన్‌కు ఎలా చేరుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం అమెరికా అధ్యక్షుని పర్యటన వివరాలు చాలా గోప్యం అనే చెప్పాలి. అతికొద్ది మందికి మాత్రమే ఆయన ఇజ్రాయెల్ పర్యటన వివరాలు తెలుసు. ఈ పర్యటన షెడ్యూల్ లీక్ కాకుండా సీక్రెట్ సర్వీస్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఉక్రెయిన్ పర్యటనలో సమయంలోనూ బైడెన్ రహస్యంగానే వెళ్లారు. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. ప్రత్యేక రైల్లో ఆయన ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో అతని భద్రతా విభాగంలో పలువురు అధికారులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. అదేరీతిలో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంలోనూ భద్రత కల్పించారు. అయితే బైడెన్ విమాన మార్గం ద్వారా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ చేరుకున్నారా? లేక రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్లారా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా అధ్యక్షుని కాన్వాయ్‌లో ఏ క్షిపణి ప్రభావానికి గురికాని బీస్ట్ వంటి కార్లు ఉన్నాయి. అంతేకాకుండా బైడెన్ విమానంలో ప్రయాణించిన పక్షంలో దానికి భద్రతగా ముందు వెనకల యుద్ధ విమానాలను కూగా మోహరిస్తారు. ఈ యుద్ధ విమానాలు ఎటువంటి దాడులనైనా తిప్పికొడతాయి. ఇది కూడా చదవండి: హమాస్‌లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి? -
లండన్ తుపాకీ చట్టాల్ని తప్పుపట్టిన ట్రంప్
లండన్: అమెరికాలో తన ప్రభుత్వం అనుసరిస్తోన్న తుపాకీ సంస్కృతిని సమర్థిస్తూ.. మరోవైపు లండన్‌లోని కఠినమైన తుపాకీ చట్టాల్ని హేళన చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం డాలస్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏ) సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ‘లండన్‌లో జరిగిన ఒక అంశం గురించి ఇటీవల చదివాను. అక్కడ నమ్మలేనంత కఠినంగా తుపాకీ చట్టాలున్నాయి. అందువల్ల కత్తిపోటు గాయాలతో చేరిన జనాలతో ఒకప్పటి ప్రముఖ ఆస్పత్రి యుద్ధభూమిని తలపించిందట. ఎందుకంటే వారికి తుపాకులు లేవు.. కత్తులే ఉన్నాయి’ అని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ద.కొరియా అధ్యక్షుడు మూన్తో 22న ట్రంప్ భేటీ మరోవైపు, దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈనెల22న సమావేశం కానున్నారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో జరిగే ఈ భేటీ సందర్భంగా ఉ.కొరియా అధినేత కిమ్‌తో గత వారం చర్చించిన అంశాలను మూన్ వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కిమ్‌తో జరగబోయే భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలనూ ట్రంప్, మూన్‌లు చర్చించనున్నారు. -
రణరంగంగా మారిన జమ్మలమడుగు
-
రణరంగంగా మారిన జమ్మలమడుగు
కడప: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ దౌర్జన్యం చేసి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం రణరంగంగా మారింది. టీడీపీ, పోలీసులకు మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. జమ్మలమడుగులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పాయువు ప్రయోగం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు జరిపిన రాళ్ల దాడిలో పోలీసు ఎస్‌ఐసహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అధికారులు రంగంలోకి దిగారు. -
ఎంపీ అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లిన టీడీపీ నేతలు
-
లోక్‌సభ..రణరంగం


