లాహోర్: పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్‌జోన్‌లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.
కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్‌జోన్‌లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్‌కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్‌లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్‌తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.


