
పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్
అవసరమైతే యుద్ధరంగంలోకి
వారిని కచ్చితంగా వాడుకుంటాం
పార్లమెంటు సాక్షిగా ప్రకటన
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది.
మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే.
‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్‌ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.
– సాక్షి, నేషనల్ డెస్క్