మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్‌ | Telugu Youth Arrested in Child Exploitation Case | Sakshi
Sakshi News home page

మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్‌

Mar 20 2026 2:01 AM | Updated on Mar 20 2026 9:35 AM

Telugu Youth Arrested in Child Exploitation Case

అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 ఏళ్ల బల్కం నాగరాజుగా గుర్తించారు. 

పోలీసుల ప్రత్యేక విభాగం (Special Victims Unit) ఆన్‌లైన్‌లో మైనర్లుగా నటిస్తూ ఈ అండర్‌కవర్ ఆపరేషన్‌ చేపట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

నాగరాజుపై అమెరికా చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులు అమెరికాలో అత్యంత కఠినంగా పరిగణించబడతాయి. మైనర్లకు సంబంధించిన నేరాలు అక్కడి చట్టవ్యవస్థలో చాలా తీవ్రమైనవిగా భావించబడతాయి. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే, అది కేవలం అరెస్టుతో ముగియదు. బెయిల్ దొరకడం చాలా కష్టం. దీర్ఘకాలికంగా విచారణలు కొనసాగుతాయి. వీసా రద్దు, డిపోర్టేషన్, శాశ్వత నిషేధం వంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement