ఇమ్రాన్ ఖాన్ మేధోశక్తి.. భారత్‌ జనాభా 13 వందల కోట్లు అంటా?: వైరల్‌ | Imran Khan Says India Population Is 1 Billion 300 Crores Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ ఖాన్ మేధోశక్తి... భారత్‌ జనాభా 13 వందల కోట్లు అంటా?: వైరల్‌

Aug 3 2021 7:34 PM | Updated on Aug 3 2021 10:15 PM

Imran Khan Says India Population Is 1 Billion 300 Crores Video Goes Viral - Sakshi

ఓ దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి. కనీసం మాట్లాడుతున్నామో అనే అవగాహన అయినా ఉండాలి. చుట్టు పక్కల దేశాల్లో పరిస్థిలపై ఓ అవగాహన ఉండాలి.  

ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. రాత పరీక్ష, ముఖాముఖి ఇంటర్వ్యూ, బృంద చర్చలు అని వివిధ దశల్లో పరీక్షిస్తారు. మరి రాజకీయ ఉద్యగం పొందాలంటే. ఇవేవి అవసరం లేదు. ఓ పార్టీ పెట్టి, ప్రజల్లో మంచి ఇమేజ్‌ సంపాదిస్తే చాలు. కానీ ఓ దేశ ప్రధాని అంటే ఎలా ఉండాలి. కనీసం ఏం మాట్లాడుతున్నామో అనే అవగాహన అయినా ఉండాలి. చుట్టు పక్కల దేశాల్లో పరిస్థిలపై ఓ అవగాహన ఉండాలి.  

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మేధోశక్తిని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ జనాభా ‘‘వన్‌ బిలియన్‌ అండ్‌ త్రీ హండ్రెడ్‌ క్రోర్స్‌’’ అని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక ఇంతకు మందు జపాన్, జర్మనీ పొరుగు దేశాలు అని తెలిపిన ఇమ్రాన్‌.. చైనాను పాకిస్తాన్ పొరుగు దేశంగా కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే.  కాగా ఇమ్రాన్‌ క్రికెట్‌ గురించి మాట్లాడుతూ.. క్రికెట్‌లో రెండు ప్రపంచకప్‌లు ఒకటి టెస్ట్ క్రికెట్, రెండోది వన్డే క్రికెట్ ఉన్నాయని ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా జూన్‌లో జరిగిన ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను ప్రశంసించాడు.

అయితే భౌగోళికంగా జపాన్, జర్మనీ దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ పాకిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. అంతే కాకుండా 2019 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 136 కోట్లు. దీంతో ఈ వీడియోకు సంబంధించి నెటిజన్‌లు ఇమ్రాన్ ఖాన్ భౌగోళిక పరిజ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్‌ చేస్తున్నారు. ఓ ఉద్యోగం సంపాదించాలంటే.. ఎన్నో వడపోతలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులకు వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలోచించి మాట్లాడవయ్యా బాబు అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement