పాక్‌ మాజీ ప్రధాని కన్నుమూత

Pakistan Former PM Mir Zafarullah Khan Passed Away In Islamabad - Sakshi

ఇస్లామాబాద్‌ : పాక్ మాజీ ప్రధాని మీర్ జఫారుల్లా ఖాన్ జమాలి కన్నుమూశారు. బుధవారం రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని జమాలి కుమారుడు మొహమ్మద్‌ ఖాన్‌ జమాలి వెల్లడించారు. 76 ఏళ్ల జమాలీ కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురికావడంతో.. రావల్పిండిలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ (ఏఎఫ్‌ఐసీ- ఎన్ఐహెచ్‌డీ)లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా జమాలి ఆరోగ్యం మరింత విషమించి మరోసారి గుండెపోటు రావడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. (చదవండి : 2024లో పోటీ చేస్తాను: ట్రంప్‌)

మాజీ  మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2002 నవంబర్ నుంచి 2004 జూన్ వరకు జమాలీ ప్రధానిగా కొనసాగారు. కాగా ఆ తర్వాత  ముషారఫ్‌తో వచ్చిన విభేదాల కారణంగా 2004లో ప్రధాని పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top