అప్పటి వరకు భారత్‌తో చర్చలు జరపం: ఇమ్రాన్‌

Imran Khan Said No chance of Bilateral Talks With India until Curfew Lifted - Sakshi

ఇస్లామాబాద్‌ : కశ్మీర్‌లో విధించిన ఆంక్షలు తొలగించే వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తేలేదని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌తో కొనసాగుతున్న దౌత్య సంబంధాలను సైతం నిలిపివేసింది. అయితే తాజాగా పాక్‌ ప్రధాని మరోసారి రెచ్చిపోయారు. బుధవారం అక్కడి ప్రాంతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుతాం. అప్పటి వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపం.’ అని వ్యాఖ్యానించారు. 

రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆర్టికల్‌ 370 రద్దు జరిగిందని భారత్‌ అనేకసార్లు స్పష్టంచేసినప్పటికీ పాక్‌ భారత్‌పై తన మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. అంతటితో ఆగకుండా మాటల యుద్ధానికి దిగుతోంది. అయితే కశ్మీర్‌ అంశం దేశ అంతర్గత విషయమని ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి పాకిస్తాన్‌కు ఏ హక్కు లేదని భారత ప్రభుత్వం అనేకసార్లు పాక్‌కు తెలిపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై కూడా ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తుచేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top