చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే! | Chapagutthi Tree Huberantha Cerasoides Medicinal Benefits And Uses | Sakshi
Sakshi News home page

చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే!

Sep 4 2026 9:08 AM | Updated on Sep 4 2026 9:08 AM

Chapagutthi Tree Huberantha Cerasoides Medicinal Benefits And Uses

అడవి పండ్ల జాతి – 17

English Name: Cherry Ashok
శాస్త్రీయ నామం: హుబెరాంత సెర సైడెస్‌
Scientific Name: 
Huberantha cerasoides (Roxb.) Chaowasku 
Synonym(s): Polyalthia cerasoides (Roxb.) Bedd.
Guatteria cerasoides (Roxb.) Wall.               
Uvaria cerasoides Roxb.
కుటుంబం: అనూనేసి
Family: Annonaceae

  • వాడుక భాషల్లో చాపగుత్తి పండు జాత పేర్లు:
    ఇంగ్లీష్‌ : చెర్రి అశోక్‌ 
    ఒరియా: చంపతీ, పంజోన్, పోట్‌ మోస్సు 
    కన్నడ: సన్న హెసటే, నెట్టలింగమర, హెబ్బేసన్నహేగురె 
    తమిళం: ఇరుంపులి 
    తెలుగు: గుత్తి దిద్దుగ, చిట్టి దుద్దుగ, గువ్వ, తెల్ల చిలక దూది, చాపగుత్తి 
    మరాఠీ: వచ్ఛిన, హంబు 
    మలయాళం: నరేల, చేరునేడునార్‌ 
    హిందీ: కుడిమి

  • పూత: జనవరి – ఫిబ్రవరి, పండ్లు : మే – జూన్‌

చాపగుత్తి చెట్టును గురించి చాలా మందికి తెలియదని చెప్పవచ్చు. దీని జినస్‌ క్రింద అనేక జాతుల చెట్లు ఉన్నాయి. కానీ, ఈ చెట్టుకు ఔషధ గుణాల వల్ల మంచి పేరు ఉంది. దీని శాస్త్రీయనామం గుట్టెరియా సెరసోడెన్‌ లేక ఉవ్వేరియా సెరసోడెన్‌ లేక ΄ాలియాలియా సెరసోడెన్‌ అని కూడా అంటారు. హుబరేంత సెరసోడెన్‌ మొదలగు పేర్లతో ఈ చెట్టును గుర్తించిన తరువాత.. చెట్టు లక్షణాలను బట్టి పేరును మార్చారు.

ఇవి కూడా చదవండి: చెదల బెడదకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ పద్ధతులు ట్రై చేయండి!

ఉనికి..
చాపగుత్తి చిన్న చెట్టు. దీని పూలు పసుపుపచ్చ రంగులో గుత్తులుగా ఉంటాయి. పండులో ఒక గింజ మాత్రమే ఉంటుంది. ఈ చెట్టుకు ఆకులు రాల్చే స్వభావముంది. దాదాపు 15–20 మీటర్ల ఎత్తు వరకు నేల స్వభావాన్ని బట్టి పెరుగుతుంది. ఇవి ఉష్ణ్ర΄ాంత అడవుల్లో పెరుగుతాయి. చాపగుత్తి చెట్ల ఉనికిని ఎక్కువగా తూర్పు ఆసియా – దక్షిణ చైనా, భారత్, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం తదితర దేశాల్లో గుర్తించారు. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల అడవులు దీనికి పెట్టింది పేరు. ఔషధ గుణాలున్న చెట్టయినప్పటికీ దీన్ని మైదాన ప్రాంతాల్లో పెంచలేక పోయారు.

చాపగుత్తి ఉపయోగాలు..

  • చాపగుత్తి చెట్టుకు ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

  • చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బెరడులోని నార (పట్ట)ను తాళ్ళు, నార సంచులు తయారు చేయటానికి ఉపయోగిస్తారు.

  • ఈ పూలు మంచి సువాసన వాసనను వెదజల్తుదూ ఉంటాయి. అత్తరుల తయారీకి ఉపయోగిస్తారు. వీటి కలపను, పరికరాలు, ఫర్నీచర్‌ తయారు చేయటానికి ఉపయోగిస్తారు.

  • వీటి పండ్లు తింటారు. వీటి బెరడులో యాంటి ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి అల్టేసియా, శరీరంలో వాపు తగ్గించే ఔషధాలలో వాడుతారు. నేటికి గిరిజనులు వీటి బెరడును ఔషధ తయారీలో వాడుతున్నారు. వీటి గింజల నుండి ఔషధ, సుగంధ నూనె తయారు చేయొచ్చు. వీటి కలప నుండి వినీల్, ప్లైఉడ్‌ తయారీలో వాడుతారు.

  • చాప గుత్తి చెట్లు నల్లమల అడవులలో ఒకప్పటి లాగ ఇప్పుడు లేవు. దీనికి దారితీసిన కారణాలు అనేకం. 
    అందులో వాతావరణ మార్పులు మొదటిది. వీటి ఉనికిని కా΄ాడటం ఎంతైనా అవసరం.

    - డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

  • నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement