పచ్చడి తిని 14 మంది మృతి
                  
	మేఘాలయాలోని మారుమూల గ్రామం సైఫుంగ్లో జరిగిన ఘోర విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అడవి పళ్లతో చేసిన పచ్చడి తిని 14 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. వీరంతా ఓ రోడ్డు నిర్మాణంలో పనిచేసేందుకు ఒడిషా నుంచి మేఘాలయాకు వలస వచ్చారు.  
	
	సోమవారం ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఆదివారం రాత్రి భోజనంలో విషపు పండ్లతో చేసిన పచ్చడి తినడం వల్లే మరణాలు సంభవిచినట్లు భావిస్తున్నామని, అవగాహన లేకే ఇలా జరిగి ఉంటుందని, పోస్ట్మార్టం రిపోర్టుకూడా దీనిని బలపరిచే అవకాశం ఉందని ఐజీ జీపీ రాజు మీడియాకు తెలిపారు.