పాక్‌ ఆర్మీకి చావు దెబ్బ.. 25మంది సైనికులు హతం? | 25 pakistani military personnel killed in balochistan attacks bla claims | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీకి చావు దెబ్బ.. 25మంది సైనికులు హతం?

Sep 4 2026 1:31 PM | Updated on Sep 4 2026 2:16 PM

25 pakistani military personnel killed in balochistan attacks bla claims

పాక్‌ ఆర్మీకి మరో చావు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన సైనిక కాన్వాయ్‌పై భారీ దాడి చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. ఈ దాడిలో  25 మంది పాకిస్థాన్‌ సైనికులు మరణించారని, రెండు సైనిక వాహనాలకు నిప్పంటించినట్లు BLA పేర్కొంది. అయితే దీనిపై పాకిస్థాన్‌  ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

బలూచిస్థాన్‌ ఆర్మీ తన ప్రకటనలో.. బీఎల్‌ఏ ఆర్మీ జియారత్‌ క్రాస్‌ వద్ద పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. కాన్వాయ్‌లోని రెండు వాహనాలపై ధ్వంసం చేశామని అందులో ఒక ఆర్మీ ట్రక్‌ సైతం ఉన్నట్లు పేర్కొంది. ఈ దాడిలో మొదట 18 మంది సైనికులు మరణించినట్లు ప్రకటిన విడుదల చేయగా అనంతరం ఆ మరణాల సంఖ్యను 25కు పెంచుతూ సవరించింది.

దాడికి సంబంధించిన దృశ్యాలుగా పేర్కొంటూ BLA తన అధికారిక మీడియా ఛానల్‌ “హక్కల్‌”లో ఈ దాడికి సంబంధించిన వీడియో చేసినట్లు తెలిపింది. ఈ వీడియోలో జియారత్‌ క్రాస్‌ వద్ద జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అయితే ఇది పూర్తి వీడియో కాదని, దాడికి సంబంధించిన పూర్తి వీడియోను తరువాత విడుదల చేస్తామని  తెలిపింది.

ఇదిలా ఉండగా, మరో వేరు ఘటనలో సురాబ్‌లోని హజికా ప్రాంతంలో పాకిస్థాన్‌ ఆర్మీ వాహనంపై దాడి చేసినట్లు BLA ప్రకటించింది. తమ “స్పెషల్‌ టాక్టికల్‌ ఆపరేషన్స్‌ స్క్వాడ్‌” (STOS) పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని రిమోట్‌ ద్వారా పేల్చిందని  పేర్కొంది.ఈ దాడిలో ఒక ఆర్మీ వాహనం పూర్తిగా ధ్వంసమైందని, ఏడుగురు పాకిస్థాన్‌ సైనికులు మరణించారని  తెలిపింది. అయితే ఈ ప్రకటనలు పూర్తిగా బీఎల్ఏ ఆర్మీ ప్రకటించినవే పాకిస్థాన్‌ దీనికి సంబంధించిన ఏటువంటి ప్రకటన చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement