breaking news
nipple free
-
వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రస్తుతం యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ వేటలో దూసుకెళ్తున్నాడు. నాలుగు నెలల పాటు మణికట్టు గాయం కారణంగా ఆటకు దూరమైన అల్కరాజ్ యూఎస్ ఓపెన్ ద్వారా పునరాగమనం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌కు చేరిన అల్కరాజ్ టైటిల్ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. టోర్నమెంట్లో అల్కరాజ్ ధరించిన బనియన్ (Nike OutFit) వైరల్‌గా మారింది. అతడి బనియన్ కారణంగా సోషల్ మీడియాలో అల్కరాజ్ "నిపుల్గేట్" (Nipplegate) ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.విషయంలోకి వెళితే యూఎస్ ఓపెన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్ జులపాల జుట్టుతో పాటు వేషదారణను కూడా పూర్తిగా మార్చేశాడు. మొదటి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు అల్కరాజ్ నైక్ (Nike) బ్రాండ్‌కు చెందిన లూజ్-ఫిట్టింగ్ బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్ ధరించాడు. Photo Credit: Twitterమ్యాచ్ సమయంలో అతను కోర్టులో వేగంగా కదులుతున్నప్పుడు ఆ లూజ్ జెర్సీ పక్కకు జరిగి, అతని కుడి వైపు రొమ్ము భాగం (Nipple) పదే పదే బయటకు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. "లవ్ యూ కార్లోస్, కానీ నీ రొమ్ము భాగాన్ని కప్పి ఉంచేలా టైట్ బనియన్ వేసుకొని బరిలోకి దిగు" అని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కామెంటేటర్ యూజినీ బౌచర్డ్ ఎక్స్ వేదికగా ఫన్నీ కామెంట్ చేసింది.తన ఔట్ఫిట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, కామెంట్లను అల్కరాజ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ బ్రౌన్ ట్యాంక్ టాప్ కింద వైట్‌కలర్ అండర్ షర్ట్ ధరించడం కనిపించింది. మ్యాచ్ సమయంలో వేగంగా కదిలినప్పటికీ అతడి రొమ్ము భాగం కనిపించలేదు. Photo Credit: Twitterఇక మ్యాచ్ అనంతరం ఫ్రెస్ కాన్ఫరెన్స్‌లో అల్కరాజ్ మాట్లాడుతూ తన ఔట్ఫిట్పై సరదాగా స్పందించాడు. “ఇటీవల నా రొమ్ము భాగం నాకే ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపించింది. అందుకే కనీసం ఒక్క మ్యాచ్‌కైనా వాటిని దాచేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇన్నర్‌వేర్ రూపంలో రెండో షర్ట్ ధరించడం చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. ఇకపై దీనినే కొనసాగిస్తాను” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమేనని, నైక్ సంస్థ దీనికి కారణం కాదని అల్కరాజ్ మరోసారి స్పష్టం చేశాడు. No more wardrobe malfunctions for Carlos Alcaraz 😂 pic.twitter.com/BDEfGRs4Pf— TNT Sports (@tntsports) September 5, 2026 Cue the Carlos Alcaraz break of serve! pic.twitter.com/SB8YyFHLCK— US Open Tennis (@usopen) August 31, 2026 Quem será que ganhou esse sorriso do Carlitos 😍.. pic.twitter.com/ytqhNRiY7F— Central Carlos Alcaraz (@AlcarazCentral) September 4, 2026చదవండి: బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్ -
ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు?
న్యూయార్క్: అన్నింటా మగవాళ్లతో సమాన హక్కులు కోరుతున్న మహిళలు ఆదివారం నాడు చిత్రమైన డిమాండ్‌తో ముందుకొచ్చారు. నెక్కరు తప్ప బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి అచ్చాదన లేకుండా మగవాడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు తాము మాత్రం ‘నిపుల్స్ ఫ్రీ’గా ఎలాంటి అచ్చాదన లేకుండా ఎందుకు తిరగకూడదని సవాల్ చేశారు. చేయడమే కాదు, బొడ్డు పైభాగం నుంచి తల వరకు ఎలాంటి ఆహార్యం లేకుండా వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. పలు వీధులు తిరుగుతూ తమ కొత్త హక్కుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందులో పిల్లల నుంచి బామ్మల వరకు పాల్గొనగా, పురుషులు కూడా వారికి మద్దతుగా నెక్కరు తప్ప ఏమీ లేకుండా వారి వెంట వీధుల్లో నడిచారు. ‘మీ స్వేచ్ఛకు మేము అడ్డు కాదు’ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రదర్శనలు ఒక్క అమెరికా నగరాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో జరిగాయి. న్యూయార్క్ సిటీలో మాత్రం మరింత ఆకర్షణగా జరిగాయి. ఎక్కడ తిరిగినా ఫర్వాలేదుగానీ ‘టైమ్ స్క్వేర్’కు మాత్రం రావద్దంటూ స్థానిక మేయర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించారు. 1992 నుంచే ‘టాప్‌లెస్’గా న్యూయార్క్ నగరంలో మహిళలు తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు ఓ ఉద్యమంగా నిర్వహించడం మాత్రం తమకు నచ్చలేదని న్యూయార్క్ మేయర్ బిల్ దే బాసియో, పోలీసు కమిషనర్ బిల్ బ్రాటన్ వ్యాఖ్యానించారు. ఈ టాప్‌లెస్ మహిళలు ఆఖరికి వాషింఘ్టన్ డీసీలో దేశాధ్యక్ష భవనాన్ని కూడా వదిలిపెట్టారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉన్న కారణంగా భావప్రకటనా స్వేచ్ఛ కింద మచ్చుకు లిబర్టీ విగ్రహంలా టాప్‌లెస్‌గా నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ‘టాప్‌లెస్’ నిరసనకు హాలీవుడ్ తార, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చారు. ‘గో టాప్‌లెస్’, ‘నిపుల్ ఫ్రీ’ పేరిట ఆమె ఇచ్చిన పిలుపుకు ప్రపంచంలోని 60 నగరాల్లో మహిళలు స్పందించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. న్యూయార్క్ సిటీతోపాటు మన్‌హట్టన్, ఎడెన్‌బర్గ్ లాంటి అమెరికా నగరాల్లోనే ఎక్కువ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లతోపాటు తమకు టాప్‌లెస్ హక్కులు ఉండాలని రాచెల్ జెస్సీ డిమాండ్ చేశారు. మగవాళ్లతో పోలిస్తే తాము అన్ని రంగాల్లో అణచివేతకు గురవుతున్నామని, మొదట తాము తమ శరీర భాగాలకు స్వేచ్ఛను కలిగించాలని కోరుకుంటున్నామని, అలా చేయడం వల్ల మెదడు కూడా స్వేచ్ఛగా ఫీలవుతుందని ఆమె అన్నారు.


