ఇది నాణెమా.. వెండి కొండా? చూస్తే షాక్‌ అవుతారు! | Worlds Largest Silver Coin Guinness Record USA 250th Anniversary Texas | Sakshi
Sakshi News home page

చిన్న నాణెం అనుకుంటే పొరపాటే! దీని బరువు ఎంతంటే?

Sep 6 2026 1:18 PM | Updated on Sep 6 2026 1:24 PM

Worlds Largest Silver Coin Guinness Record USA 250th Anniversary Texas

ఫండే

వింతలు విశేషాలు

రెండు అడుగుల వ్యాసం.. దాదాపు 79 కిలోల బరువు.. చూస్తే ఇది నాణెమని నమ్మడం కష్టమే! అచ్చం వెండి కొండలా కనిపిస్తున్న ఈ భారీ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? దీని విలువ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం!

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెండినాణెం. అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టెక్సస్‌కు చెందిన ‘టెక్సస్‌ ప్రీషియస్‌ మెటల్స్‌ ఎల్‌ఎల్‌సీ’ కంపెనీ ఈ నాణేన్ని ‘సన్‌షైన్‌ మింటింగ్‌’ కంపెనీతో కలసి రూపొందించింది. దీని తయారీ కోసం స్వచ్ఛమైన వెండిని ఉపయోగించింది. రెండు అడుగుల వ్యాసం గల ఈ నాణెం బరువు 78.881 కిలోలు. సన్‌షైన్‌ మింటింగ్‌ కంపెనీకి చెందిన హస్త కళాకారులు దీనిని తయారు చేశారు.

ఒకవైపు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీలో కాగడా ధరించిన చేతిని, నక్షత్రాలను; మరోవైపు గద్దను అమెరికా వైభవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దారు. ఈ నాణెం ముఖవిలువ 250 డాలర్లు. దీనిని కస్టమ్‌ డిస్‌ప్లే బాక్స్‌లో పెట్టి, ప్రదర్శనకు అనువుగా భద్రపరచారు. ఇప్పటి వరకు ఇంత భారీనాణెం ఎక్కడా లేకపోవడంతో గిన్నిస్‌ బుక్‌ ఈ నాణేన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నాణెంగా గుర్తించింది. టెక్సస్‌లోని ఆస్టిన్‌ నగరంలో దీనిని ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారు.

ఇవి కూడా చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement