అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా? | Ayatollah Ali Khamenei Always Hide His Right Hand | Sakshi
Sakshi News home page

అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?

May 1 2026 3:33 PM | Updated on May 1 2026 4:29 PM

Ayatollah Ali Khamenei Always Hide His Right Hand

టెహ్రాన్‌: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్‌ సుప్రీమ్ లీడర్‌గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?

ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్‌ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.

అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్‌పై ఓ టేప్‌రికార్డ్‌ పెట్టాడు. దానిని ఆన్‌ చేశాడు. ఇరాన్‌లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్‌ గ్రూప్‌ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది.  

ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్‌, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.

ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్‌ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.

కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్‌గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement