O Andala Rakshasi Movie
-
రాక్షసి వస్తోంది
షెరాజ్ మెహదీ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, సంగీతం అందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్డే, కృతీ వర్మ హీరోయిన్లుగా నటించారు. సురీందర్ కౌర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది.ఈ చిత్రాన్ని ఈ నెల 24న రీ–రిలీజ్ చేస్తున్న సందర్భంగా షెరాజ్ మెహదీ మాట్లాడుతూ– ‘‘సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో మా మూవీలో చూపిస్తున్నాం. అలాగే మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశం ఉంది’’ అన్నారు. ఈ చిత్రంలో నేహా దేశ్ పాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్, అనంత్ బాబు, ప్రియ కీలక పాత్రలు పోషించారు. -
‘ఓ అందాల రాక్షసి’ మళ్లీ వచ్చేస్తోంది
షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను’ అని తెలిపారు.ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రంలో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, షెరాజ్ మెహదీ, నేహా దేశ్‌పాండే, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం. -
కన్నడలో హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న తెలుగు సినిమా
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కథాంశంతో షెరాజ్ మెహదీ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోగా, దర్శకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ మెప్పించారు. ఈ మూవీలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా వచ్చిన ‘ఓ అందాల రాక్షసి’ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.


