రాక్షసి వస్తోంది | O Andala Rakshasi Movie Re Release Press Meet | Sakshi
Sakshi News home page

రాక్షసి వస్తోంది

Apr 20 2026 12:04 AM | Updated on Apr 20 2026 12:04 AM

O Andala Rakshasi Movie Re Release Press Meet

షెరాజ్‌ మెహదీ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, సంగీతం అందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్డే, కృతీ వర్మ హీరోయిన్లుగా నటించారు. సురీందర్‌ కౌర్‌ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది.

ఈ చిత్రాన్ని ఈ నెల 24న రీ–రిలీజ్‌ చేస్తున్న సందర్భంగా షెరాజ్‌ మెహదీ మాట్లాడుతూ– ‘‘సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో మా మూవీలో చూపిస్తున్నాం. అలాగే మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశం ఉంది’’ అన్నారు. ఈ చిత్రంలో నేహా దేశ్‌ పాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్, అనంత్‌ బాబు, ప్రియ కీలక పాత్రలు పోషించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement