నో షార్ట్‌కర్ట్స్‌ : సింపుల్‌ రూల్‌తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్‌ | from XXL to M size Badminton coach lost 16 kg by fixing her diet | Sakshi
Sakshi News home page

నో షార్ట్‌కర్ట్స్‌ : సింపుల్‌ రూల్‌తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్‌

Apr 18 2026 7:13 PM | Updated on Apr 18 2026 7:51 PM

from XXL to M size Badminton coach lost 16 kg by fixing her diet

బరువు తగ్గాలంటే కచ్చితత్వంతో, నిబద్దతతో వ్యాయామం, ఆహార నియమాలు పాటించాలి. అయితే చిన్న అవమానంతో ఒక బ్యాడ్మింటన్ కోచ్‌ తన జీవన శైలినిమార్చుకుంది. ఆహారనియమాలను సరిచేసింది.కట్‌ చేస్తే.. 16 కిలోలు తగ్గింది. అయితే  ఈ మార్పు  అకస్మాత్తుగా జరగలేదు. ఎంతో పట్టుదలతో కష్టపడి సాధించింది. అని చాటి చెప్పింది. విమర్శలనే సవాల్‌తీసుకుని  విజయ తీరాలకు బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

36 ఏళ్ల బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ, తల్లి అయిన తర్వాత సుమారు 20 కిలోల బరువు పెరిగారు. ఒకానొక దశలో ఆమె బరువు 79 కిలోలకు చేరుకుంది. అయితే ఒక  రోజు తన క్లయింట్లలో ఒకరు, "మీరే మంచి శారీరక స్థితిలో లేకపోతే, మీ విద్యార్థులకు శిక్షణ  ఎలా ఇవ్వగలరని ఆశిస్తున్నారు?" అని అనడంతో అవమానంగా భావించింది. ఎంత మాట అనిపించుకున్నానే అని చిన్నబుచ్చుకుంది.కానీ అక్కడితే ఆగిపోలేదు.అప్పుడే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చక్కటి  ఆహార నియమాలతో  దాదాపు 16 కిలోలు బరువు తగ్గింది.  XXL నుండి M సైజుకు  మారిపోయింది. మొదట్లో ఆమె 'క్రాష్ డైట్స్' (అతిగా పస్తులు ఉండటం) ప్రయత్నించింది, కానీ ఫలితం తాత్కాలికంగానే ఉండేది. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో బరువు తగ్గడం ప్రారంభించారు. కాలిలో రాడ్ ఉన్నప్పటికీ, పట్టుదలతో క్రమబద్ధమైన వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాహారంపై దృష్టి పెట్టింది. 

ఇదీ చదవండి: మోమోస్‌ తింటున్నారా? మెమరీ లాస్‌, లివర్‌ నాశనం, చివరికి!?
 

డైట్ ప్లాన్
ఆపిల్, ఓట్స్ (40 గ్రా), పోహా (40 గ్రా).
అన్నం (50 గ్రా), గోధుమలు (40 గ్రా).
ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన), ఒక స్కూప్ వే ప్రోటీన్.

ఇలా  రోజూ  కేలరీలను లెక్క వేసుకుంటూ నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకునేది. ఫలితంగా తన బరువును 79 కిలోల నుండి 63 కిలోలకు తగ్గించుకుంది."అప్పట్లో నేను XXL సైజ్ బట్టలు వేసుకునేదాన్ని, ఇప్పుడు M సైజ్‌కు మారాను. వార్డ్‌రోబ్ మొత్తం మార్చడం వల్ల జేబుకు చిల్లు పడినా, నా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది!" అని ఆమె గర్వంగా  చెబుతుంది.

ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!

ఆమె సలహా..షార్ట్‌కట్స్ వద్దు, త్వరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేయకండి, స్థిరంగా బరువు తగ్గాలంటే  స్థిరత్వం, పౌష్టికాహారం, వ్యాయామం అవసరం, ఫలితం నెమ్మదిగా వచ్చినా, క్రమం తప్పని అలవాట్లను పాటించండి అంటారామె.

నోట్‌ : బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైన పోషకాహారం వ్యాయామం కలయిక. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. క్రాష్‌డైట్స్‌ ఎప్పటికీ మంచిది కాదు. ఏదైనా నిర్ణయం  తీసుకునేముందు వైద్యులను లేదా నిపుణులను  సంప్రదించడం ఉత్తమం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement