పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, ఆధునిక జీవనశైలిలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆహార, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన ఢిల్లీలోని బురారీలో చోటుచేసుకుంది. మెమోస్ తింటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ వివరాలు తెలుసుకుదాం.
మెమోస్.. వేడి వేడిగా, కారం కారంగా, వెజ్ ఆర్ నాజ్ వెజ్ మోమోస్ తినడం చాలా మందికి ప్రాణం. కానీ నిత్యం మోమోస్ వల్ల 10 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బురారీకి చెందిన కిషోర్, సావిత్రి దంపతుల తాన్యతోపాటు 8 ఏళ్ల గౌరీ అనే మరో పాపకూడా. తల్లి సావిత్రి మాథుర్,కేర్‌టేకర్‌గా తండ్రి కిషోర్ మొబైల్ రిపేర్లు చేసే పనిలో ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, తాన్య తన తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుని రోజూ బయట మోమోస్, చిప్స్ వంటివి కొని తినేది. క్రమంగా ఆమె మెదడు పని తీరు దెబ్బతింది. జ్ఞాపకశక్తిని కోల్పోవడం ప్రారంభించింది, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయింది, చివరికి నడవడానికి కూడా ఇబ్బంది పడింది. రోజు రోజుకు ఆమె పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.
ఇదీ చదవండి: రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్? పీఐబీ స్పందన
లక్షణాలుఎలా బయపడ్డాయి?
చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం (జ్ఞాపకశక్తి తగ్గడం)తో సమస్య మొదలైంది. ఏగాగ్రతలేదు అనుకున్నారు. ఆ తరువాత విపరీతమైన నీరసం, అలససటతో బాధపడేది. చివరికి నడవలేని స్థితికి చేరుకుంది. అప్పుడు వైద్యులను సంప్రదించగా షాకింగ్ నిజాలా వెలుగు చూశాయి. వైద్య పరీక్షలలో ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలింది. ఆమె శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల, మెదడు వాచిపోయింది, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. మోమోస్ వంటి ఫాస్ట్ ఫుడ్‌ను తరచుగా తినడమే ఆమె పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారించారు.
వైద్యులు మొదట ఆ బాలికకు కాలేయ మార్పిడి చేయాలని సిఫార్సు చేశారు. కానీ ప్లాస్మాఫెరెసిస్ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శైలేష్ శర్మ ప్రకారం, ఢిల్లీలో దాదాపు 35 శాతం మంది పిల్లలు ఫ్యాటీ లివర్ లక్షణాలను చూపిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, అధిక స్క్రీన్ సమయం , శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. దీంతో చిన్న పిల్లలలో కూడా తీవ్రమైన కాలేయ వైఫల్యం కేసులు కనిపిస్తున్నాయి. అంతేకాదు సగటున రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలి, కానీ చాలామంది 1 నుండి 1.5 లీటర్లు మాత్రమే తాగుతున్నారు. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతోందని కూడా ఆయన హెచ్చరించారు.
ప్లాస్మాఫెరిసిస్ (Plasmapheresis) అంటే
శరీరంలోని రక్తం నుండి విషపూరితమైన ప్లాస్మాను తొలగించి, దాని స్థానంలో శుభ్రమైన ప్లాస్మాను ఎక్కించే ప్రక్రియ. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గి, అది కోలుకోవడానికి అవకాశం కలిగింది. రెండు యూనిట్ల ప్లాస్మా సహాయంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది.
ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!


