మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది! | woman throws Rs 1 crore cash from highrise apartment rush to collect | Sakshi
Sakshi News home page

మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!

Apr 18 2026 3:55 PM | Updated on Apr 18 2026 4:16 PM

woman throws Rs 1 crore cash from highrise apartment rush to collect

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది.  అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్‌నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్‌హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.  అయితే  ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? 

హై రేంజ్‌ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా  రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో  ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు   ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

నెటిజన్ల  స్పందన 
ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
 

ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement