మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు | UP IAS officer pet langur walks into meeting room sits on her chair | Sakshi
Sakshi News home page

మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

Apr 18 2026 12:52 PM | Updated on Apr 18 2026 3:07 PM

UP IAS officer pet langur walks into meeting room sits on her chair

ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయ మీటింగ్‌లో జరిగిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న  ఐఏఎస్‌, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో ఒక అనుకోని అతిథి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత విషయం తెలిసి అంతా  సరదాగా  నవ్వుకున్నారు. ఈ సంఘటన బాఘ్‌పత్‌లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందీ అంటే..

బాఘ్‌పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ రాయ్ రైతుల సమస్యలను వింటున్నారు. ఈ సమయంలో కోతి ఆడిటోరియంలోకి ప్రవేశించి, నేరుగా డీఎం టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న పత్రాలను లాగడం చూసి అధికారులు భయాందోళనకు గురయ్యారు.   కోతి ఆకస్మిక చర్యలతో అవాక్కైన కొంతమంది ఆఫీసర్లు సీట్లు వదిలి పారిపోయారు. 

ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్

 

ఇంతకీ ఈ కోతి ఎవరో తెలుసా?  జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్  పెంపుడు కోతి. దీని పేరు 'మాత్రు'. మాతృను చూడగానే జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తన కుర్చీలోంచి లేచారు.  అధికారులు, రైతుల ముందు ప్రశాంతంగా ,అస్మితా లాల్ చిరునవ్వు నవ్వి, మాతృను తన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించారు.  అది పోయి అక్కడ పొందికగా కూర్చంది. ఆ తర్వాత అధికారులు మాతృని మెల్లగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో వాతావరణం సద్దు మణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement