రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్‌? పీఐబీ స్పందన | RBI really announced new rules for exchanging old notes check the truth | Sakshi
Sakshi News home page

రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్‌? పీఐబీ స్పందన

Apr 18 2026 5:28 PM | Updated on Apr 18 2026 6:20 PM

RBI really announced new rules for exchanging old notes check the truth

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు  వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ  సోషల్‌  మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.


2016లో రద్దయిన పాత  రూ. 1000, రూ. 500,  నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీంతో   బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)  ​ స్పందించింది.  ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని  ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని  ఫార్వర్డ్‌ చేయొద్దని కూడా హెచ్చరించింది. 

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని  తమకు సెండ్‌ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను (rbi.org.in) చెక్‌ చేయాలని వెల్లడించింది.


WhatsApp: +91 8799711259
Email: factcheck@pib.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement