ఉక్రెయిన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి | Unknown Person Gun Fire In Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

Apr 19 2026 7:30 AM | Updated on Apr 19 2026 7:30 AM

Unknown Person Gun Fire In Ukraine

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో దుండగుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పది మంది వరకు గాయపడ్డారు. హొలొసివ్‌స్కీ ప్రాంతంలోని ఓ మాల్‌లో ఉన్న సూపర్‌మార్కెట్‌లో శనివారం ఓ దుండగుడు హఠాత్తుగా తుపాకీతో కాల్పులకు దిగాడు.

ఇక, ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. అనంతరం కొందరిని అతడు నిర్బంధంలోకి తీసుకున్నాడు. వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసులపైకి కాల్పులకు దిగాడు. నలుగురు బందీలను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement