దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం | Maharashtra womans emotional celebration is winning hearts | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం

Apr 19 2026 12:12 PM | Updated on Apr 19 2026 12:37 PM

Maharashtra womans emotional celebration is winning hearts

మనం సాధించే గెలింపు మనొక్కరిదే కాదు. అందుకు సహకరించి కుటుంబసభ్యులది కూడా. అయితే వారి క్రెడిట్‌ కనబడదు. కానీ ఈ మహిళ తన సక్సెస్‌ వెనుక తన తండ్రి ఉన్నాడంటూ..అందరికీ తెలియజేసేలా ఆమె చేసిన పని..అక్కడున్న వారి కళ్లలో నీళ్లుగిర్రున తిరిగేలా చేశాయ్‌. ఆ కమనీయ దృశ్యం ఓ ప్రేరణ కూడా.

అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, సుమేధా షేక్  ఇంటిని చక్కబెడుతూ, ఇద్దరు పిల్లల భాద్యత, దివ్యాంగుడైన తండ్రి బాగోగులు చూసుకుంటూ పోలీస్‌ అధికారిణి అయ్యారు. ఆమె తన విజయాన్ని జరుపుకున్న విధానం అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. తండ్రిని భుజాలపై ఎత్తుకుని ఆ క్షణాన్ని ఒక హృదయపూర్వక నివాళిగా మార్చారు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారి అందరి హృదయాలను గెలుచుకుంది. 

తల్లిదండ్రుల త్యాగం ఎప్పుడూ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ మన జీవితాంతం ప్రతిధ్వనిస్తుందని అని చెప్పేలే ఈ మహిళ సెలబ్రేషన్‌ చేసుకుంది తన సక్సెస్‌ని. ఈ మేరకు కొత్తగా పోలీసు అధికారిణిగా నియమితురాలైన సుమేధా మట్లాడుతూ..తన కష్టసుఖాల్లో అండగా నిలిచి, తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడిన తండ్రికి ఇలా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 

ఆ వీడియోలో సుమేధా దివ్యాంగుడైన తన తండ్రిని భుజాలపై మోస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. అక్కడున్న వారు కూడా ఆమె సంతోషంలో భాగమయ్యారు. కొందరు ఆమె తన అసాధారణ విజయాన్ని తన తండ్రికే అంకితం చేస్తూ.. వేడుకగా చేసుకున్న తీరుని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్‌. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి ఇది 'ఉత్తమ తండ్రీ-కూతుళ్ల బంధం' అని అభివర్ణించగా మరికొందరు విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయంగానే కాకుండా..ఆ ప్రయాణానికి సహకరించి బంధాలది కూడా అని చెప్పే ఘటన అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..! కారణం తెలిస్తే అవాక్కవుతారు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement