పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగిగా కొనసాగడం అత్యంత అరుదు. అందులోనూ పిల్లలు స్థిరపడ్డాక, ఎలాంటి చీకు చింత లేకుండా పదవీ విరణమ చేశాక ఎవ్వరైన రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ తాతగారు అందుకు విభిన్నం. అదికూడా యువకులు చేసే గిగ్‌వర్క్ జాబ్‌లో జాయిన్ అవ్వడం..పైగా ఎన్ని డెలివరీలు కంప్లీట్ చేశారో తెలిస్తే..తాతగారు మీరు సూపర్ అని ప్రశంసించకుండా ఉండలేరు. మరి ఎందుకు ఆయన ఇంత వయసులో ఇంత కష్టపడుతున్నారంటే..
అహ్మదాబాద్‌కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి, మాజీ క్లర్క్ దినేష్ మహంత్ ఠాకోర్దాస్ మంచి స్థిరపడ్డ కుటుంబం. ఆయనకు ముగ్గురపిల్లలు వాళ్లు కూడా బాగా స్థిరపడ్డారు. ఆయనకు ఏమి అంత ఆర్థిక బాధ్యతలు కూడా ఏమిలేవు. కానీ తన పరిసర ప్రాంతంలో ఒక బ్లింకిట్ డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అదొక ఆసక్తికరమైన ఉద్యోగంలా అనిపించి చేయాలనకున్న జాబ్ కాస్తా సాధారణ కార్యకలాపంగా మారింది. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్‌లో న్యూస్ ఆల్జీబ్రా ఖాతా నుంచి షేర్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆయన రోజు ఉదయం 5.00లతో రోజు ప్రారంభించి ఉదయం 6.00లకు కంపెనీ స్థానిక డార్క్ స్టోర్‌కు చేరుకుంటారట. తన ఇష్టపడే షిఫ్ట్ సుమారు రూ. 11.30 గంటలకు మొదలవుతుందట. ఆ తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా ముగించాలా అని నిర్ణయించుకుంటారట. ఇలా గత రెండేళ్లలో సుమారు 10,220 డెలివరీలను పూర్తి చేశారట. అయితే ఈ సంపాదన మాత్రం ఇంటి ఖర్చుల కోసం కాదట. కొత్త నగరాలు, రాష్ట్రాలు, దేశాలు సందర్శించడానికి వినియోగిస్తారట.
అంతేగాదు ఆయన అనుభవమే గొప్ప గురువు అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారట. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మన పాత తరం వారి వృత్తిపరమైన నిబద్దతత చూసి ఎంతగానో ఆశ్చర్యం కలిగిందంటూ ..పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఈ వయసులో ఇంత శారీరక శ్రమ అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటూ హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.
A 66-year-old retired clerk from Ahmedabad is delivering on Blinkit, and he has no plans to stop.
Dinesh Mahant Thakordas spent 26 years at a life insurance company, raised a family, and built a stable life. He and his wife have three children, all well-settled. With no… pic.twitter.com/iUZ6WENJv1— News Algebra (@NewsAlgebraIND) April 17, 2026
(చదవండి: ‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!)


