నగ్న వీడియో కాల్స్‌ దందా.. సాయి, ముగ్గురు మహిళలు.. | Video Calls Danda Identified In Guntur Tenali | Sakshi
Sakshi News home page

నగ్న వీడియో కాల్స్‌ దందా.. సాయి, ముగ్గురు మహిళలు..

Apr 19 2026 10:40 AM | Updated on Apr 19 2026 12:41 PM

Video Calls Danda Identified In Guntur Tenali

గుంటూరు: గుంటూరులోని తెనాలి చెంచుపేట కేంద్రంగా న్యూడ్‌ వీడియో కాల్స్‌ దందా వెలుగులోకి వచ్చింది. నిర్వాహకులైన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ట్రిప్ టాక్ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్‌ ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం నిర్వహిస్తున్న సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోర్టల్ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

వివరాల మేరకు.. తెనాలి పట్టణ పరిధి పాండురంగపేట, చెంచుపేటకు చెందిన మగ్గురు మహిళలు చెంచుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడకు మహిళలను తీసుకువచ్చి ఈ న్యూడ్‌ కాల్స్‌ చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఈ కాల్స్‌ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో స్ట్రిప్‌టాక్‌ పేరిట ఉన్న పోర్టల్‌లో లాగిన్‌ అయి ఈ న్యూడ్‌ కాల్స్‌ వ్యవహారం జరుపుతున్నారు. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న ఏ దేశం నుంచైనా ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయి న్యూడ్‌ కాల్స్‌కు నగదు చెల్లించి లైవ్‌లో మహిళలతో న్యూడ్‌ కాల్స్‌లో చాటింగ్‌ చేయవచ్చు. తెనాలి నిర్వాహకులు స్వీటీ – క్యూటీ పేరిట లాగిన్‌ అయి దాని ద్వారా ఇతర మహిళలతో ఈ దందా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ముందు మాస్క్‌ వేసుకుని చాట్‌ చేసి నగదు చెల్లింపు పూర్తయ్యాక న్యూడ్‌ కాల్స్‌ చేస్తుంటారని పోలీసులు తెలిపారు.

సులువుగా డబ్బు సంపాదన... 
ఓ గదిలో ఉండి దుస్తులు లేకుండా వీడియో కాల్‌లో కనిపిస్తే రూ.500 నుంచి రూ.వెయ్యి ఇస్తామంటూ మహిళలు, యువతులను నిర్వాహకుడు సాయి.. ఈ రొంపిలోకి దించుతున్నాడు. ఇలా తెనాలిలో ఈ దందా నిర్వహిస్తున్న వారి వద్ద సుమారు 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారని, వారిలో రోజుకు ఒకరిద్దరు ఈ కాల్స్‌కు వచ్చి వెళ్తుంటారని సమాచారం. నిర్వాహకులైన ముగ్గురు మహిళలు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు కావడంతో వారికి ఆన్‌లైన్‌ పోర్టల్, వాటి లాగిన్, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు. ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టడం, న్యూడ్‌కాల్స్‌కు ఒప్పుకున్న మహిళలను కారులో అద్దె ఇంటికి తీసుకెళ్లడం వంటివి సాయి చేస్తుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో, సాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement