Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.
సదరు యువతి అలర్ట్‌గా లేకపోవడం.. సడెన్‌గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.
लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।
ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026
ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు.


