రోమ్: ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాదించేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని క్యాథలిక్కుల మతపెద్ద పోప్ లియో–14 స్పష్టం చేశారు. దైవ సందేశాన్ని బోధించడమనే తన కర్తవ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తానని చెప్పారు. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి అంగోలాకు విమానంలో వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు.
తన బోధనలు ట్రంప్‌ను ప్రత్యక్షంగా ఉద్దేశించినవి కావని, విస్తృత శాంతి సందేశంలో అవి ఒక భాగమని వివరించారు. తన పర్యటన మొదటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఏర్పడిన రాజకీయ వాతావరణం కారణంగా.. తనపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్నారు. అందులోని కొన్ని అంశాలు నిజాలు కావని చెప్పారు.


