అరటిపండు (banana) అలా వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా?
అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్ వంకరగా వస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్ స్పాట్స్ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

వింత పండు ’రంబుటాన్’
’రంబుటాన్’ పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్ అయిపోగానే రంబుటాన్ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.
ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్ చేసుకుంటారు, ఐస్ క్రీంలో వేసుకుంటారు.హెల్త్‌కి చాలా మంచిది! విటమిన్ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి


