ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా? | Meenakshi Seshadri recreates iconic song from their Telugu movie | Sakshi
Sakshi News home page

Meenakshi Seshadri: చిరంజీవి హీరోయిన్‌.. 34 ఏళ్లైనా అదే స్టెప్పులు..!

Apr 16 2026 6:57 PM | Updated on Apr 16 2026 7:39 PM

Meenakshi Seshadri recreates iconic song from their Telugu movie

మెగాస్టార్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆపద్బాంధవుడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. 1992లో విడుదదలైన ఈ క్లాసిక్‌ సూపర్ హిట్ మూవీలో  చిరంజీవి సరసన హీరోయిన్‌గా మీనాక్షి శేషాద్రి కనిపించింది. ఈ మూవీ రిలీజై నేటికి 34 ఏళ్లవుతోంది. అప్పట్లో ఈ చిత్రంలో ఓ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అవురా అమ్మకు చెల్లా అంటూ సాగే పాట సినీ ప్రియులను అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సాంగ్‌ అభిమానులను మెప్పించింది.

దాదాపు 34 ఏళ్ల తర్వాత హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అవురా అమ్మకు చెల్లా పాటకు స్టెప్పులను రీ క్రియేటే చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె ఈ పాటకు చిందేశారు. 62 ఏళ్ల వయసులోనూ అదే స్టెప్పులతో అదరగొట్టారు. ఆమె డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీనాక్షి శేషాద్రి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా తెలుగు సినిమా 'ఆపద్భాంధవుడు'లోని ఈ అందమైన పాటను ఉగాది ఇన్‌స్టాలో పోస్ట్ చేద్దామనుకున్నా.  కానీ కొంచెం ఆలస్యమైంది. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీ అందరి కోసం ఈ సాంగ్ తీసుకొచ్చా. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో.. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని పూడపల్లి అనే మారుమూల గ్రామంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటను కులు మనాలిలోని పచ్చని ప్రకృతిలో షూట్ చేశారు. డల్లాస్‌లోని నా బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం లుక్‌ను రూపొందించడం చాలా సరదాగా అనిపించింది.' అని పోస్ట్ చేసింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement