అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్‌ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు.
ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందన
ఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.
ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్‌లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్‌పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్‌కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.
New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl
— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026
ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్‌లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!"
ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్
కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి


