శనివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
ఆకాశం మేఘావృతమై, మబ్బులు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
వడగండ్లు పడ్డాయి. సాయంత్రం ఆహ్లాదకరంగా మారింది. ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం దక్కింది.


