ఆస్ట్రోనాట్‌గా అగ్రహీరో! | as an astronaut Salman Khan hosts biggboss 10 | Sakshi
Sakshi News home page

ఆస్ట్రోనాట్‌గా అగ్రహీరో!

Aug 27 2016 7:18 PM | Updated on Sep 4 2017 11:10 AM

ఆస్ట్రోనాట్‌గా అగ్రహీరో!

ఆస్ట్రోనాట్‌గా అగ్రహీరో!

చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టినప్పుడు.. గుడ్డు నుంచి కోడిపిల్ల తొలిసారిగా పుట్టినప్పుడు సరికొత్త చరిత్ర నమోదైంది.

'చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టినప్పుడు.. గుడ్డు నుంచి కోడిపిల్ల తొలిసారిగా పుట్టినప్పుడు సరికొత్త చరిత్ర నమోదైంది. అదేవిధంగా తొలిసారి సామాన్యులు బిగ్‌బాస్‌ షోలోకి రాబోతున్నారు. ఇది హిస్టరీ క్రియేట్‌ చేస్తుందా? లేక మిస్టరీనా?' అంటూ సల్మాన్‌ ఖాన్‌ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు.

దేశంలో అత్యంత వివాదాస్పదమైన పాపులర్‌ టీవీ షో 'బిగ్‌బాస్‌' తాజా ప్రోమోలో ఆస్ట్రోనాట్‌గా సల్మాన్‌ కనిపించాడు. వ్యోమగామిగా కనిపిస్తూ.. బిగ్‌బాస్‌-10 షోలో తొలిసారిగా సెలబ్రిటీలు ఉండబోరని, మొత్తం సామాన్యులతో ఈసారి షో నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. మిడ్‌ సెప్టెంబర్‌లో  కలర్స్‌ చానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement