బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేయనున్నారు. ఈ షో తొమ్మిదో సీజన్ అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇదే చివరి సీజన్ కావడంతో తొలి ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సల్మాన్‌ను ఆటపట్టించిన కరణ్
‘కాఫీ విత్ కరణ్’ షోలో సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలతో ఇరుకున పెట్టడం కరణ్ జోహార్‌కు అలవాటు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్‌ను పాత ప్రశ్నతో ఆటపట్టించారు. గతంలో అడిగిన ప్రశ్ననే మళ్లీ ప్రస్తావిస్తూ.. ‘మీరు ఇప్పటికీ వర్జినేనా?’ అని అడిగారు. దీనికి సల్మాన్ ‘కంట్రోల్.. బ్రదర్.. కంట్రోల్’ అంటూ బదులివ్వడం టీజర్‌లో నవ్వులు పూయిస్తోంది.
సల్మాన్ కామెంట్స్
ఈ షో చివరి సీజన్ కావడంపై సల్మాన్ సరదాగా స్పందించారు. సెలబ్రిటీలను షోకు రప్పించేందుకు కరణ్ ఇదో కొత్త ప్లాన్ వేసినట్లుందని చమత్కరించారు. అయితే, ‘కాఫీ విత్ కరణ్’ ముగిసిపోవడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్‌లో మరిన్ని ఆసక్తికరమైన సంభాషణలు ఉండనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: సినిమా ఆఫర్‌కోసం ఆ డైరెక్టర్ నన్ను పడుకోమన్నాడు: స్టార్ నటి)


