‘బిగ్‌బాస్‌ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్‌! | Bigg Boss Telugu 10 Telugu Announcement Special Video | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. 10వ సీజన్‌ వచ్చేస్తోంది

Jun 7 2026 2:01 PM | Updated on Jun 7 2026 3:18 PM

Bigg Boss Telugu 10 Telugu Announcement Special Video

‘బిగ్‌బాస్‌’ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో.. త్వరలోనే 10వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు నిర్వాహకులు. 10వ సీజన్‌కు కూడా కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.

‘బిగ్‌బాస్‌.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’అంటూ నాగార్జున చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో స్పెషల్‌ వీడియో ప్రారంభం అవుతుంది. 

బిగ్‌బాస్‌పై రూపొందించిన ఓ ప్రత్యేక పాటతో వీడియో ఆద్యంతం అలరించేలా సాగుతుంది. చెదరని ప్రస్థానం..తరగని అభిమానం బిగ్‌బాస్‌ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్‌బాస్‌ దశావతారం’ అంటూ సీజన్‌ 10పై ఆసక్తిని పెంచేశాడు నాగార్జున. ఇక ప్రతి సీజన్‌ ఏదో ఒక క్యాప్షన్‌తో వచ్చే బిగ్‌బాస్‌.. ఈ సారి కూడా ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? కంటెస్టెంట్స్‌ ఎవరనే విషయాలను మాత్రం ప్రకటించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement