బిగ్‌బాస్ 10: రోహిత్‌కి బ్లాక్ కార్డ్.. షాలినికి గేట్ చూపించిన నాగ్ | Bigg Boss 10 Telugu Day 48 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 48: రోహిత్-షాలిని.. నాగ్ వాయింపు మామూలుగా లేదు

Oct 25 2026 10:42 AM | Updated on Oct 25 2026 11:33 AM

Bigg Boss 10 Telugu Day 48 Episode Highlights

శనివారం వచ్చిందంటే హౌస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. వారమంతా బిగ్‌బాస్ నడిచిన దానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తారు. తప్పు చేసిన హౌస్‌‌మేట్స్‌ని వాయించేస్తారు. ఈసారి అలా షాలిని-రోహిత్‌ని ఓ రేంజులో ఆడేసుకున్నారు. వీడియోలు చూపించి మరీ వాయించేశారు. ఇంతకీ 48వ రోజైన శనివారం 10వ సీజన్‌లో అసలేం జరిగింది?

నాగ్ ఎంట్రీ తర్వాత ఆడియెన్స్‌లో కొందరు తమకు రోహిత్, షాలిని ఇష్టం అని చెప్పడంతో హౌస్‌లో వీళ్లిద్దరూ ఎలా ప్రవర్తిస్తున్నారో వీడియోలు ప్లే చేసిన నాగార్జున.. వీళ్లేనా మీకు నచ్చింది అని అడిగారు. లేదు సార్ అలా ఉండకూడదు అని వాళ్లతోనే అనిపించారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ జరగలేదు కాబట్టి వచ్చే వారం కెప్టెన్ ఎవరూ ఉండరని ప్రకటించిన బిగ్‌బాస్.. గ్రీన్ లెవల్‌లోని నీతూ, త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్ ఇంటి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.

(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)

నాగ్ టీవీలో కనిపించగానే కంటెస్టెంట్స్ అంతా లేచినిలబడ్డారు కానీ రోహిత్, షాలినిలు లేచినట్టే లేచి వెంటనే కూర్చున్నారు. నరేశ్‌ని తెగ పొగిడేసిన నాగార్జున.. బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నావని ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రూంకి నరేష్‌కి అనుమతి ఉంటుందని బంపరాఫర్ ఇచ్చారు. అమన్, దేబ్జానీ, నీతూ.. గ్రీన్ లెవల్‌లోకి వెళ్లినందుకు మెచ్చుకున్నారు. ముకేశ్ గురించి నాగ్ చెబుతూ.. నిన్ను జెంటిల్‌మెన్ అనుకున్నాను. మాటలు జారవు అనుకున్నా కానీ జారుతున్నావ్. ఎలా ప్రవర్తిస్తున్నావో చూడు అని వీడియో వేసి చూపించారు. ఏమైంది నీ క్యారెక్టర్.. ఎందుకంత దిగజారి మాట్లాడావ్. శివ్ పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎందుకు? అని క్లాస్ పీకారు. ఇలానే ఉంటే నీ పతనం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక శివ్‌ని మెచ్చుకున్న నాగార్జున.. ఆటలో వైల్డ్ ఫైర్ చూపిస్తున్నావ్. నిన్ను నువ్వు ప్రతి విషయంలో నిరూపించుకుంటున్నావ్. నువ్వు కరెక్ట్‌గా ఆడితే నిన్ను కొట్టేవాడు లేడు. ఎందుకంటే నీలో ఫైర్ ఉందని తెగ పొగిడేశాడు.

రాంప్రసాద్‌ని సూటిగా ప్రశ్నించిన నాగార్జున.. షాలిని తిరిగి రావడం నీకు నచ్చిందా? లేదా? అని అడిగారు. ‘నాకు నచ్చలేదు సార్. ఈ హౌస్‌ నుంచి ఓటింగ్ ప్రకారం బయటకు వెళ్లింది కాబట్టి తను బయట ఉంటేనే బెటర్ అనిపించింది. ఆడియెన్స్ ఓట్లు వేసి ఆమెను బయటకు పంపారు. మళ్లీ తీసుకుని రావడం నచ్చలేదు. పోనీ రీ ఎంట్రీ తరువాత ఏదైనా ఇంప్రూమెంట్ ఉంటుంది అనుకుంటే అదీ లేదు. కానీ ఆమె ఏం మారలేదు. అలాగే ఉంది అని రాంప్రసాద్ అన్నాడు. తర్వాత రామకృష్ణ గేమ్‌ పట్ల నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే ఆడితే జనం బయటకు పంపేస్తారు అని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత షాలిని గురించి మాట్లాడిన నాగ్.. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగారు. దాంతో షాలిని.. ‘అందరూ నన్ను ఎలిమినేట్ అయ్యి మళ్లీ వచ్చావ్ అని అంటుంటే చాలా బాధగా ఉంది సార్. నేను నా గేమ్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నా. అది వాళ్లు చూడటం లేదు’ అని ఎమోషనల్ అయిపోయింది. దీంతో వీడియో ప్లే  చేయించిన నాగార్జున.. ఎంతలా దిగజారి ప్రవర్తించిందో చూపించారు. బిగ్‌బాస్ నీకు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చారు? నీ పర్సనాలిటీ ఏం మార్చుకున్నావ్? నీకు మరో వీడియో చూపిస్తా అంటూ మరొకటి ప్లే చేశారు.

ఇందులో షాలిని.. పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది. దక్షి మీదకు దూసుకెళ్తూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది. ఓ పక్క రాంప్రసాద్ ఆపుతున్నా వాట్ వాట్ అంటూ దక్షిని కొట్టడానికి వెళ్లిన వీడియో చూపించి షాలినిని కడిగిపారేశారు. కోపం వస్తే కంట్రోల్‌లో ఉండవా? ఫిజికల్ ఎందుకు అవుతున్నావ్? మీద మీదకు ఎందుకు వెళ్తున్నావ్. నీతూతో అదే చేశావ్? వర్షిణితో అదే చేశావ్.. దక్షితో అదే చేస్తున్నావ్. ఇవన్నీ పక్కనపెట్టేస్తా.. రూం గురించి చూద్దాం అంటూ మరో వీడియో చూపించారు నాగ్. నువ్వు అందర్నీ పర్సనల్ ఎటాక్ చేస్తావ్. నీ గురించి ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేవ్. ఇదేనా మారడం అంటే. ఎలిమినేటై స్టేజ్ మీదికి వచ్చినప్పుడు నువ్వు నాతో ఏమన్నావ్. ఇది నాకు బర్త్ డే గిఫ్ట్ సార్. కంప్లీట్‌గా మారిన షాలిని కనిపిస్తుందని అన్నావ్. నాకు ప్రామిస్ చేసి మళ్లీ వెళ్లావ్ అని రోహిత్‌తో సరసాలు చేస్తున్న వీడియోలని ప్లే చేశారు. ఏం చేస్తున్నారు మీరిద్దరూ. మీరు ముద్దులు పెట్టుకున్నారని త్రిగుణ్ అన్నందుకు ఫీల్ అయిపోయావ్. నేషనల్ టెలివిజన్‌లో అలా అనడం తప్పు అన్నావ్. మరి అదే నేషనల్ టెలివిజన్‌లో చేయడం తప్పు కాదా? అని నాగార్జున ప్రశ్నించారు. దెబ్బకి తలదించేసుకున్న షాలిని.. నేను ఈ బాధ తీసుకోలేను. బయటకు వెళ్లిపోతానని చెప్పింది. ఇదంతా అలా జరుగుతుండగానే పక్కనే ఉన్న రోహిత్ చేయి ఎత్తాడు. ఏంటి రోహిత్ చేయి ఎత్తావ్? అని నాగ్ అడగ్గానే.. తను నాకు మునివేళ్లతో ఏదో రాస్తుందని వీడియో చూపించారు కదా దాని గురించి మాట్లాడతా మీరు పర్మిషన్ ఇస్తే అని అన్నాడు. సరే చెప్పు అంటే షాలిని గురించి మాట్లాడాడు. నువ్వు చేయి ఎత్తింది నీ గురించి మాట్లాడటానికా? లేక షాలిని గురించి మాట్లాడటానికా? అని నాగ్ ఫైర్ అయ్యారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు)

అది రొమాంటిక్‌గా చేసింది కాదు సార్ అని రోహిత్ అనడంతో.. నేను అలా చెప్పానా? నేను సైన్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగానంతే. నేను ఆమెతో మాట్లాడుతున్నా మధ్యలో ఎందుకు లేస్తున్నావ్? ఇది ఏమన్నా నామినేషన్ అనుకుంటున్నావా? నేను షాలినిని నామినేట్ చేయడం లేదు. కూర్చో అంటూ రోహిత్‌కి నాగ్ ఇచ్చిపడేశారు. తర్వాత షాలిని సారీ సార్ అని అనడంతో ఎన్నిసార్లు చెప్తావ్ సారీ. నీకు వెళ్లిపోవాలని ఉంటే ఈ క్షణమే వెళ్లిపో అని అన్నారు. దాంతో షాలిని క్షణం కూడా ఆలోచించకుండా నేను వెళ్లిపోతా అని అన్నది. వెంటనే నాగార్జున.. డోర్స్ ఓపెన్ చేయండి అని అన్నారు. ఆల్రెడీ నువ్వు రెడ్‌లో ఉన్నావ్, వెళ్లొచ్చు అని నాగార్జున అన్నారు. జనాలు నన్ను వెళ్లిపోవాలని ఓట్లు వేశారు. నేను దానిని గౌరవించాలి. వెళ్లిపోతా అని షాలిని అంటుంటే లేదు నువ్వు ఉండాల్సిందే అని రోహిత్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో నాగార్జున.. నువ్వు వెళ్తున్నావా? ఉంటున్నావా? నేను వెయిట్ చేస్తున్నా నీ నిర్ణయం కోసం అని అన్నారు. నేను వెళ్లను సార్.. నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకొని వెళ్తా అని షాలిని ఏడుస్తూనే చెప్పింది.

తర్వాత త్రిగుణ్‌తో మాట్లాడిన నాగార్జున.. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావా. అవతల వ్యక్తి గుడ్ అని నేను చెప్పడం లేదు. సపోర్ట్ చేయడం లేదు. ఏంటి అదంతా నిన్ను, రోహిత్‌ని చూసి ముకేశ్‌ నేర్చేసుకున్నాడు.. ఇలాగే గేమ్ ఆడాలేమో అని అనుకుంటున్నాడు.. ఇది కరెక్ట్ కాదు ముకేశ్.. వాళ్ల దగ్గర నేర్చుకోకు. ఆడియెన్స్ ఛీ కొడతారు అని నాగ్ అన్నారు. త్రిగుణ్ తను తప్పు చేశానని ఒప్పుకొనేసరికి.. నీకేం పనిష్మెంట్ కావాలి అని నాగ్ అడగ్గానే నా 'గోట్' శివ్‌కి ఇచ్చేస్తా అని త్రిగుణ్‌ అనగానే అది నువ్వు ఆడి గెలుచుకొని సంపాదించుకుంది అని నాగ్ అన్నాడు. తర్వాత రోహిత్‌తో మాట్లాడిన నాగార్జున.. ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు. నీయమ్మా అనడం ఏంటి? ఇదా నీ క్యారెక్టర్? నామినేషన్ల గురించి మాట్లాడొద్దు అన్నా విన్నావా? ముకేశ్‌ని ఫైల్స్‌ రాజా అనడం ఏంటి? నీ ఆట  చాలా బాగుందని ఇష్టపడ్డవాళ్లు నువ్వు పడిపోతున్నావ్‌ అని చెప్పారు. వాళ్లతో మాట్లాడు అని ప్రేక్షకులతో మాట్లాడిస్తారు. గేట్ బయట దొరకవా అని అంటావా? నువ్వు వాళ్లకు దొరకవా? కప్పులు కడిగే వాడు కప్పులు కొట్టడా? తప్పులు మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఏంటి ఇది? నీకు ఇప్పటికే ఓ ఎల్లో కార్డు వచ్చింది. షాలినిలా నేను క్షమించలేను. నీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఇంట్లో ఉంటావా? అందరికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళ్లిపోతావా? రోహిత్‌కి బ్లాక్ బ్యాడ్జ్. ఇది నీ క్యారెక్టర్ మీద ఒక బ్లాక్ మార్క్. ఏది వద్దు అంటున్నామో అది కంటిన్యూగా చేస్తున్నావ్. ఈ బ్లాక్ బ్యాడ్జ్‌ నీ మీద ఉంటుంది. డోర్‌కి అడుగు దూరంలో ఉన్నావ్. ఇంకొక్క సారి వీటిలో ఏం జరిగినా ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతావ్ అని చెప్పి బ్లాక్  బ్యాడ్జ్‌ ఇచ్చిన నాగార్జున.. ఇంటిని రూల్ చేయడానికి నువ్వు అర్హుడివి కాదు. ఈ ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు కెప్టెన్‌ అవ్వవు అని చెప్పారు. రోహిత్‌ మోకాలి మీద కూర్చొని అలా చేయొద్దు సార్ అది నా గేమ్ మొత్తాన్ని షట్‌డౌన్ చేస్తుంది. ప్లీజ్ మిమల్ని బతిమాలుతున్నా అని అడిగితే.. ఇంట్లో వాళ్లకి నాగ్ ఓటింగ్ వేయమని అంటే పది మంది ఓటు వేస్తారు. రెండు వారాలు నువ్వు కెప్టెన్ అవ్వలేవు. నీ ప్రవర్తన మారితే ఛాన్స్ వస్తుందని అన్నారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఆమెని ఎలిమినేట్ చేసేశారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement