'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు | Bigg Boss 10 Kannada: FIR Filed Against Contestant Tanisha Kuppanda Over Remark Against Bhovi Community - Sakshi
Sakshi News home page

Bigg Boss Show: అలాంటి కామెంట్స్.. బిగ్‌బాస్ బ్యూటీపై కేసు

Published Wed, Nov 15 2023 4:27 PM | Last Updated on Wed, Nov 15 2023 4:38 PM

Bigg Boss 10 Tanisha Kuppanda Police Case - Sakshi

బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామందికి గొడవలే గుర్తొస్తాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ ప్రసారమవుతోంది. శివాజీ దగ్గర నుంచి శోభా వరకు అందరూ కప్ కొట్టడమే టార్గెట్ పెట్టుకుని మరీ ఆడుతున్నారు. మరోవైపు కన్నడలోనూ 10వ సీజన్ నడుస్తోంది. అయితే తెలుగుతో పాటు కన్నడ షోలో వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్‌పై ఏకంగా పోలీస్ కేసు నమోదైంది.

ఏంటి విషయం?
'ఈగ' ఫేమ్ సుదీప్.. కన్నడలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకి హౌస్ట్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ షోలో ఓ కంటెస్టెంట్ పులిగోరుతో ఉన్న లాకెట్ వేసుకోవడం గమనించిన పోలీసులు.. షో జరిగే చోటుకి వచ్చి మరీ అతడ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఓ లేడీ కంటెస్టెంట్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

అసలేం జరిగింది?
నవంబరు 8న ప్రసారమైన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో భాగంగా తనీషా అనే లేడీ కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్ ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్‌తో మాట్లాడుతూ.. 'వడ్డా' అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట‍్ర అధ్యక్షురాలు పద్మ.. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్‌పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. అయితే బిగ్‌బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి అని పద్మ, తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. గత సీజన్‌లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్ని అన్నప్పటికీ, ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement