breaking news
Tanisha Kuppanda
-
'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామందికి గొడవలే గుర్తొస్తాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ ప్రసారమవుతోంది. శివాజీ దగ్గర నుంచి శోభా వరకు అందరూ కప్ కొట్టడమే టార్గెట్ పెట్టుకుని మరీ ఆడుతున్నారు. మరోవైపు కన్నడలోనూ 10వ సీజన్ నడుస్తోంది. అయితే తెలుగుతో పాటు కన్నడ షోలో వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్‌పై ఏకంగా పోలీస్ కేసు నమోదైంది. ఏంటి విషయం? 'ఈగ' ఫేమ్ సుదీప్.. కన్నడలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకి హౌస్ట్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ షోలో ఓ కంటెస్టెంట్ పులిగోరుతో ఉన్న లాకెట్ వేసుకోవడం గమనించిన పోలీసులు.. షో జరిగే చోటుకి వచ్చి మరీ అతడ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఓ లేడీ కంటెస్టెంట్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) అసలేం జరిగింది? నవంబరు 8న ప్రసారమైన బిగ్‌బాస్ ఎపిసోడ్లో భాగంగా తనీషా అనే లేడీ కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్ ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్‌తో మాట్లాడుతూ.. 'వడ్డా' అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ.. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్‌పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. అయితే బిగ్‌బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి అని పద్మ, తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. గత సీజన్లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్ని అన్నప్పటికీ, ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) -
అడల్ట్ సినిమాలో న్యూడ్‌గా నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు నటి ఏమందంటే?
అందాలు ఆరబోయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణ విషయం. అవకాశాలు రావాలంటే అందాల ఆరబోత తప్పనిసరి! గ్లామర్ షో చేస్తేనే కానీ దర్శకనిర్మాతల కంట పడరు అన్నట్లు తయారైంది సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఒక్క సినీఇండస్ట్రీ మాత్రమే కాదు బుల్లితెరది కూడా ఇంచుమించు అదే పరిస్థితి! సీరియల్స్ నుంచి సినిమాకు ప్రమోషన్ రావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే! మంగళ గౌరి మధువె అనే కన్నడ సీరియల్‌తో పాపులర్ అయిన నటి తనీశా కుప్పంద తన అందంతో 2012లోనే పారిజాత అనే సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు కూడా అందుకుంటోంది. ఇటీవల ఆమె పెంటగాన్ మూవీలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది నటి. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ బ్యూటీకి ఓ యూట్యూబర్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది. 'మీరు అడల్ట్ సినిమా చేస్తారా?' అని అడిగేసరికి నటి ఒక్కసారిగా అవాక్కైంది. 'నేనేమీ బ్లూ ఫిలిం స్టార్ కాదు. మీరిలాంటి ప్రశ్న ఎలా అడుగుతున్నారు? కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవరు న్యూడ్ మూవీస్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు' అని మండిపడింది. అసలు ఆ యూట్యూబర్‌కు ఇతరులను గౌరవించడం ఏమాత్రం తెలియనట్లుంది అని కామెంట్ చేసింది.