బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేశారు.
అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్‌కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్‌ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేయండి.


