అలాంటి వాళ్లు 'బిగ్‌బాస్'కి రావొద్దు: నవదీప్ | Navdeep Reacts Uppal Balu Bigg Boss Agnipariksha Issue | Sakshi
Sakshi News home page

Navdeep: ఉప్పల్ బాలు వీడియోలపై నవదీప్ రియాక్షన్

Aug 18 2026 5:01 AM | Updated on Aug 18 2026 5:01 AM

Navdeep Reacts Uppal Balu Bigg Boss Agnipariksha Issue

ప్రస్తుతం 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష షో ప్రసారమవుతోంది. అయితే దీని జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. తన చావుకు నవదీప్ కారణమని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరుని విమర్శిస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు నవదీప్ స్పందించాడు. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)

'బిగ్‌బాస్ అనేది స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ఓ షో. 100 మంది ర‌క‌ర‌కాల మ‌న‌స్తతత్వాల మ‌ధ్య బ్ర‌తుకుతున్న‌ప్పుడు ఆ మాట‌ల‌ని ఎలా తీసుకుంటాం, ఎలా కంట్రోల్ చేసుకుంటామ‌నేదే పాయింట్. దానిని ప‌రీక్షించ‌డానికే మమ్మల్ని జ‌డ్జిలుగా పెట్టారు. వ‌చ్చిన కంటెస్టెంట్‌ల‌కు సోష‌ల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వ‌స్తున్నాయి. ఆ కామెంట్స్‌పై ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకే వాళ్ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాం. కంటెస్టెంట్ స్పంద‌న ఎలా అయినా ఉండొచ్చ‌ు. జ‌డ్జిగా వెళ్లే ముందే నాకు ఆ విష‌యం తెలుసు. హార‌ర్ సినిమాకు వ‌చ్చి బ‌యపెట్టొ‌ద్దు అంటే ఎలా? ఎవరు ఎన్ని మాటలు అన్నా తట్టుకుని నిలబడాలనేదే ఈ కాన్సెప్ట్‌. 'అగ్నిపరీక్ష' అంటేనే ట్రిగర్‌ చేయడం. నా ‌లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా త‌ట్టుకుని నిల‌బ‌డే శ‌క్తి ఉందా? ఉంటేనే రండి. అగ్నిప‌రీక్ష డిజైన్ చేసిందే దానికోసం. అలా త‌ట్టుకుని నిల‌బ‌డేవాళ్లే షోకు రండి లేదంటే రావొద్దు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు: పల్లవి ప్రశాంత్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement