బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రస్తుతం తండ్రిగా కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. కత్రినా కైఫ్‌తో కలిసి తమ కుమారుడు విహాన్‌తో ఎంజాయ్ చేస్తున్న ఆయన.. తాజాగా పేరెంటింగ్ తనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ముఖ్యంగా తన కుమారుడు నవ్వుతున్న సమయంలో కత్రినా ముఖంలో కనిపించే ఆనందాన్ని చూస్తే ఆ క్షణాన్ని అక్కడే ఆపేసి మరికొంతకాలం ఆస్వాదించాలనిపిస్తుందని చెప్పారు.
‘తండ్రిగా మారిన తర్వాత బాధ్యత కూడా పెరిగింది. పిల్లలు తల్లిదండ్రులు చేసే పనులను గమనిస్తూ నేర్చుకుంటారు. అందుకే తాను చెప్పే మాటలకంటే తన ప్రవర్తనే ముఖ్యం. మనుషులు సాధారణంగా ఎంత సాధించినా ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు. అయితే గత కొన్ని నెలల్లో తన కుమారుడుతో గడిపిన ఎన్నో సందర్భాల్లో ‘ఇంతకంటే ఇంకే కావాలి.. ఇదే చాలు’ అని భావన కలిగిందని విక్కీ వెల్లడించారు.
2021లో వివాహం..
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 2021లో వివాహం చేసుకున్నారు. 2025 నవంబర్ 7వ వీరికి విహాన్ కౌశల్ జన్మించాడు. కుమారుడి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు తీసుకురాకుండా జాగ్రత్తపడుతున్న ఈ జంట.. అప్పుడప్పుడు పేరేంటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇటీవలే కత్రినా బాడీ షేమింగ్ ట్రోలింగ్ ఎదుర్కొని ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈమెకు మద్దతుగా బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు అండగా నిలిచారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి స్పెషల్.. ఓటీటీలో చూడాల్సిన 5 సినిమాలు


