యూట్యూబ్ నుంచి ఫేమస్ అయి ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న 'బిగ్‌బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.
(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌ని పవన్ పక్కనబెట్టేశారా?)
అయితే కొన్నిరోజుల క్రితం వైష్ణవితో కలిసి గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోల్లో పెళ్లి మండంపై నూతన వధూవరులిద్దరూ కనిపించారు.
వైజాగ్‌కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)



